INTERNATIONAL

కెనడా పీఎం రేసులో ఉన్న అనితా ఆనంద్ ఎవరు?

కెనడా PM రేసులో అనితా ఆనంద్

భారత్‌తో ఉద్రిక్తత నేపథ్యంలో కెనడా PM జస్టిన్ ట్రూడో రాజీనామా చేయడంతో పీఎం రేసులోకి అనితా ఆనంద్ వచ్చారు.

అనితా ఆనంద్ ఎవరు?

భారతీయ సంతతికి చెందిన అనితా ఆనంద్ ప్రస్తుతం అంతర్గత వాణిజ్య మంత్రిగా, ట్రూడో కేబినెట్‌లో కీలక సభ్యురాలుగా ఉన్నారు. PM పదవికి బలమైన అభ్యర్థి ఆమె.

అనితా ఆనంద్ భారతీయ నేపథ్యమేంటి?

అనితా ఆనంద్ ప్రముఖ న్యాయవాది, రాజకీయ నాయకురాలు. కెనడా రక్షణ మంత్రిగా కూడా పనిచేశారు. ఆమె తండ్రిది తమిళనాడు, తల్లిది పంజాబ్.

నోవా స్కోటియాలో జననం, నలుగురు పిల్లల తల్లి

నోవా స్కోటియాలో జన్మించిన అనితా ఆనంద్ 1985లో ఒంటారియోకు వెళ్లారు. అక్కడ భర్త జాన్‌, నలుగురు పిల్లలతో కలిసి ఉంటున్నారు.

ఓక్‌విల్లే నుండి పార్లమెంటు సభ్యురాలు

2019లో ఓక్‌విల్లే నుండి పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికైన అనితా ఆనంద్.. ట్రెజరీ బోర్డు అధ్యక్షురాలిగా, రక్షన మంత్రి సహా పలు  కీలక శాఖలకు సేవలు అందించారు.

COVID-19 సమయంలో కీలక సేవలు

COVID-19 సమయంలో కెనడా ప్రజలకు వ్యాక్సిన్లు, రక్షణ పరికరాలు, రాపిడ్ టెస్టులు అందేలా అనితా ఆనంద్ చాలా కృషి చేశారు.

రక్షణ మంత్రిగా అనితా ఆనంద్ కృషి

రక్షణ మంత్రిగా, సైన్యంలో లైంగిక వేధింపుల నిరోధక చర్యలు, సైనిక వ్యవస్థలో మార్పులకు ఆమె కృషి చేశారు.

కెనడా సైనిక సాయంలో

రష్యా దాడి సమయంలో ఉక్రెయిన్‌కు కెనడా సైనిక సాయం అందించడంలో అనితా ఆనంద్ కీలక పాత్ర పోషించారు.

కెనడా రవాణా మంత్రిగా

2024లో అనితా ఆనంద్ కెనడా రవాణా మంత్రిగా, ట్రెజరీ బోర్డు అధ్యక్షురాలిగా నియమితులయ్యారు.

టొరంటో విశ్వవిద్యాలయంలో లా ప్రొఫెసర్

రాజకీయాలతో పాటు, అనితా ఆనంద్ గొప్ప పండితురాలు, న్యాయవాది, పరిశోధకురాలు కూడా. టొరంటో విశ్వవిద్యాలయంలో లా ప్రొఫెసర్‌గా పనిచేశారు.

మసీ కాలేజీ గవర్నింగ్ బోర్డు సభ్యురాలు

మసీ కాలేజీ గవర్నింగ్ బోర్డు సభ్యురాలుగా, రాట్‌మన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో పాలసీ, పరిశోధన డైరెక్టర్‌గా పనిచేశారు.

అనితా ఆనంద్ ఏం చదివారు?

క్వీన్స్ యూనివర్సిటీ నుండి పొలిటికల్ సైన్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (ఆనర్స్), ఆక్స్‌ఫర్డ్ నుండి జ్యూరిస్‌ప్రూడెన్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (ఆనర్స్) పట్టా పొందారు.

టొరంటో నుండి మాస్టర్ ఆఫ్ లా పట్టా

డల్‌హౌసీ యూనివర్సిటీ నుండి లాలో బ్యాచిలర్ డిగ్రీ, టొరంటో యూనివర్సిటీ నుండి మాస్టర్ ఆఫ్ లా పట్టా పొందారు. 1994లో ఒంటారియో బార్‌లో చేరారు.

ప్రపంచంలోనే హ్యాపియెస్ట్ కంట్రీ ఏది? ఆ ప్రజల సంతోషానికి కారణాలేంటి?

దేశ విభజన వేళ పాకిస్తాన్‌లో హిందూ దేవాలయాలెన్ని? ఇప్పుడెన్ని మిగిలాయి?

ఈ 8 పవర్ ఫుల్ ముస్లిం దేశాలు కలిస్తే ఇజ్రాయెల్ పరిస్థితి అంతే..?

పెళ్లి చేసుకుంటే రూ.31 లక్షలు ఇస్తారట.. ఎక్కడంటే?