Hyderabad
పట్టణాల్లో ఉన్న వారంతా పల్లెలకు బయలుదేరి వెళ్తున్నారు. హైదరాబాద్ నుంచి జిల్లాలకు పెద్ద ఎత్తున వాహనాలు బార్లు తీరాయి.
వాహనాల్లో సొంతూళ్లకు బయలుదేరి వెళ్తున్న వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ పోలీసులు సూచనలు చేశారు.
సొంతూరుకు వెళ్లున్న వారు వాహనాల కండీషన్‌కు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని తెలిపారు.
ఎక్కువ దూరం ప్రయాణం చేసే వారు నిపుణులైన డ్రైవర్లను తీసుకెళ్లేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి. లేదంటే వాహనం నడిపే వారు ఇద్దరైనా ఉండేలా చూసుకోవాలి.
వాహనాల టైర్లు ఎలా ఉన్నాయో చూసుకోవాలి. పగుళ్లు ఉన్నాయా.? గాలి సరిగ్గా ఉందా లేదా అన్న విషయాలను గమనించాలి.
ఎట్టి పరిస్థితుల్లో వాహనాల్లో పరిమితికి మించి ప్రయణించకూడదని సూచిస్తున్నారు. ఇది ప్రమాదాలకు కారణమయ్యే అవకాశాలు ఉంటాయి.
సొంత వాహనాల్లో వెళ్లే వారు రాత్రి పూట ప్రయాణాలను వీలైనంత వరకు తగ్గించడమే ఉత్తమం