Health
శీతాకాలంలో హార్ట్ ఎటాక్, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. గుండెపోటు రాకుండా ఏం చేయాలో ఇక్కడ చూద్దాం.
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శీతాకాలంలో చురుకైన జీవనశైలిని పాటించండి. అంటే ఇంట్లో వ్యాయామాలు, యోగా చేయండి.
మీ రక్తపోటును క్రమం తప్పకుండా చెక్ చేసుకోండి. ఇది లక్షణాలను ముందుగానే గుర్తించడంలో సహాయపడుతుంది.
బూట్లు, చేతి తొడుగులు, స్కార్ఫ్, స్వెటర్ లాంటి వెచ్చని దుస్తులు వేసుకోండి. ఇది శీతాకాలంలో శరీర ఉష్ణోగ్రతను తగ్గనివ్వకుండా సహాయపడుతుంది.
చలిగా ఉందని శీతాకాలంలో నీరు ఎక్కువగా తాగరు. ఇది గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. మీ శరీరానికి అవసరమైన నీటికి తప్పకుండా తీసుకోండి.
మిమ్మల్ని వెచ్చగా ఉంచుకోవడానికి ఆహారాన్ని వేడిగా తినండి. మీ గుండె ఆరోగ్యాన్ని పెంచడానికి శీతాకాలంలో వచ్చే పండ్లు, కూరగాయలను కూడా తప్పకుండా తినండి.
ఒత్తిడి వల్ల రక్తపోటు పెరుగుతుంది. అందుకే మీరు రిలాక్స్డ్ గా ఉండటానికి శ్వాస వ్యాయామాలు, యోగా, మెడిటేషన్ వంటివి ప్రాక్టీస్ చేయండి.
శీతాకాలంలో గుండెపోటు రాకుండా నివారించడానికి ఇవి కొన్ని సాధారణ చిట్కాలు మాత్రమే. హార్ట్ అటాక్ అని డౌట్ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.