Health

మీరు ఆరోగ్యంగానే ఉన్నారా.? ఈ 5 పరీక్షలతో అసలు విషయం తెలిసిపోతుంది

Image credits: Foods for lung health

క్యాన్సర్‌ మొదలు..

క్యాన్సర్‌, గుండెపోటు వంటి ప్రమాదకర వ్యాధులను కొన్ని రకాల సింపుల్‌ ల్యాబ్ టెస్టుల ద్వారా ప్రాథమికంగానే గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

Image credits: Getty

కంప్లీట్‌ బ్లడ్ కౌంట్‌ (సీబీసీ)

ఈ బ్లడ్‌ టెస్ట్‌ సహాయంతో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలతో పాటు లుకేమియా, రక్తహీనత, ఇన్ఫెక్షన్‌ వంటివి ముందుగానే గుర్తించవచ్చు. ఈ సమస్యలు పెరగకుండా అడ్డుకట్ట వేయొచ్చు. 
 

Image credits: FREEPIK

లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష

ఈ పరీక్ష సహాయంతో శరీరంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిని గుర్తించడంతోపాటు కరోనరీ ఆర్టరీ డిసీజ్ వంటి ప్రమాదాలను కనిపెట్టవచ్చు. దీంతో సకాలంలో సరైన చికిత్స అందించవచ్చు. 

Image credits: FREEPIK

థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్

ఈ పరీక్ష శరీరంలోని థైరాయిడ్ గ్రంధి పనితీరును పరిశీలిస్తుంది. దాని సహాయంతో ఇది హైపోథైరాయిడిజంతో పాటు హైపర్ థైరాయిడిజం వంటి థైరాయిడ్ వ్యాధులను గుర్తించడంలో సహాయపడుతుంది. 

Image credits: FREEPIK

లివర్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్

ఈ టెస్ట్‌తో లివర్‌, కిడ్నీల పనితీరును కనిపెట్టవచ్చు. కాలేయ సిర్రోసిస్, కాలేయ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల గురించి సమాచారాన్ని అందిస్తుంది. 
 

Image credits: Getty

ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ టెస్ట్

ఈ టెస్ట్‌ సహాయంతో గుండె జబ్బులు, మూత్రపిండాల వైఫల్యం, నరాలవ్యాధి వంటి అనేక ఇతర వ్యాధులకు కారణమయ్యే మధుమేహ ప్రమాదాన్ని గుర్తించవచ్చు. 
 

Image credits: Getty

బీపీ తగ్గాలంటే ఏం చేయాలి?

భారత్ లో HMPV వైరస్ : ఎవరికి ఎక్కువ ప్రమాదం..?

కొబ్బరి నీళ్లు కాదు.. కొబ్బరి పాలను తాగితే ఎన్ని లాభాలున్నాయో తెలుసా

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలా? ఈ పండ్లను కచ్చితంగా తినాల్సిందే..