Health
గుండెపోటు వచ్చే ముందు కనిపించే ప్రధాన లక్షణాల్లో కాళ్లు, పాదాలు, మడమల్లో ఉబ్బినట్లు కనిపించడం. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉన్నా వెంటనే అలర్ట్ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. గాలి పీల్చుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది.
కొందరిలో గుండెపోటు వచ్చే ముందు భుజం నొప్పి వస్తుంది. ఎలాంటి గాయం లేకుండా భుజం నొప్పి వస్తుంటే జాగ్రత్త పడాలి.
ఛాతి నొప్పి గుండెపోటుకు ప్రాథమిక లక్షణం కాకపోయినప్పటికీ.. ఈ లక్షణం కనిపిస్తే మాత్రం వెంటనే అలర్ట్ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు.
కొందరిలో గుండెపోటు వచ్చే ముందు దవడ భాగంలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఈ లక్షణం కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
చిన్న చిన్న పనులకే అసలిపోతున్నట్లు ఉన్నా, కొద్దిగా నడిచినా ఆయాసం వస్తున్నా వెంటనే గుండె సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి.
ఈ వివరాలు కేవలం ఇంటర్నెట్ వేదికగా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించినవి మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.