హైబీపీ చాలా పెద్ద సమస్య. ఎందుకంటే ఇది గుండె, రక్తనాళాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకే దీన్ని అదుపులో ఉంచుకోవాలని డాక్టర్లు చెప్తారు.
Image credits: Getty
రక్తపోటు
అందుకే చలికాలంలో అధిక రక్తపోటును ఎలా నియంత్రించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
Image credits: Getty
వెచ్చని దుస్తులు
చలివల్ల మన రక్తనాళాలు కుంచించుకుపోతాయి. అందుకే మీ శరీరం వెచ్చగా ఉండాలంటే వెచ్చని దుస్తులను, స్వెట్టర్లను, టోపీలు, స్కార్ఫ్ లను ఖచ్చితంగా ధరించాలి.
Image credits: Getty
నీళ్లు ఎక్కువగా తాగాలి
నీళ్లు తక్కువగా తాగితే బీపీ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే శరీరంలో నీటి శాతం తగ్గితే రక్తం చిక్కబడుతుంది. ఇది బీపీని పెంచుతుంది. అందుకే నీళ్లు బాగా తాగాలి.
Image credits: Getty
ధ్యానం
మానసిక ఒత్తిడి కూడా బీపీని పెంచుతుంది. అందుకే ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం, యోగా, లోతైన శ్వాస వ్యాయామాలు చేయాలి.
Image credits: Getty
ఉప్పు తక్కువగా వాడాలి
ఉప్పును ఎక్కువగా తీసుకుంటే కూడా రక్తపోటు పెరుగుతుంది. అందుకే ఉప్పు తక్కువగా వేసిన ఇంట్లో వండిన ఆహారాలను తినాలి.