Health
తులసి వాటర్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ నీళ్లను తాగితే ఫ్రీరాడికల్స్ వల్ల వచ్చే సమస్యల ప్రమాదం తగ్గుతుంది. తులసి నీళ్ల వల్ల కలిగే 5 లాభాలేంటో తెలుసుకుందాం పదండి.
ఉదయాన్నే తులసి నీళ్లను తాగితే మీ ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. దీంతో మీరు సీజనల్ వ్యాధులకు, ఇన్ఫెక్షన్లకు, ఇతర జబ్బులకు దూరంగా ఉంటారు.
ప్రతిరోజూ ఉదయాన్నే పరిగడుపున తులసి నీళ్లను తాగితే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది ఒత్తిడి, యాంగ్జైటీ తగ్గి విశ్రాంతి లభిస్తుంది.
తులసి వాటర్ లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. ఇవి మీ శ్వాసను మెరుగుపరుస్తాయి. అలాగే దగ్గు, జలుబును తగ్గించడానికి సహాయపడతాయి.
తులసి వాటర్ మన జీర్ణక్రియను మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. ఇది అజీర్ణం, కడుపు ఉబ్బరం, వాపు, వంటి సమస్యలను నయం చేయడానికి సహాయపడుతుంది.
తులసి నీటిని పుక్కిలిస్తే నోటి ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ఇది చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే నోటి దుర్వాసనను తగ్గిస్తుంది.
తులసి వాటర్ జీవక్రియను పెంచడానికి కూడా సహాయపడుతుంది. దీంతో మీరు బరువు తగ్గుతారు.
ప్రతిరోజూ ఉదయాన్నే పరిగడుపున తులసి నీళ్లను తాగడం వల్ల బోలెడు లాభాలున్నా న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకున్న తర్వాతే తాగడం మంచిది.