Health
ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మీ ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. రోజూ ఒక ఉసిరికాయ తిన్నా మీరు దగ్గు, జలుబు నుంచి దూరంగా ఉంటారు. ఇన్ఫెక్షన్లతో పోరాడటానికీ సహాయపడుతుంది.
ఉసిరిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని హెల్తీగా ఉంచడానికి, ముడతలు, గీతలు తొందరగా ఏర్పడకుండా చేయడానికి సహాయపడతాయి.
ఉసిరికాయలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. దీన్ని రోజూ ఒకటి తింటే మలబద్దకం సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.
రోజూ ఒక ఉసిరికాయ తింటే మీరు బరువు కూడా తగ్గుతారు. ఉసిరి జీవక్రియను పెంచి కొవ్వును ఫాస్ట్ గా కరిగిస్తుంది. అలాగే దీన్ని తింటే తొందరగా కడుపు నిండుతుంది. హెవీగా తినకుండా ఉంటారు.
ఉసిరికాయలో ఉండే యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు గుండె సంబంధిత సమస్యల నుంచి మనల్ని రక్షిస్తుంది. అలాగే కొలెస్ట్రాల్, రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.
ఉసిరికాయ జుట్టును కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది వెంట్రుకలను బలంగా చేస్తుంది. చుండ్రును తగ్గించి, తెల్ల జుట్టు రాకుండా కాపాడుతుంది.
డయాబెటిస్ పేషెంట్లకు ఉసిరి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉండే క్రోమియం ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
ఉసిరిలో విటమిన్ ఎ కూడా మెండుగా ఉంటుంది. ఇది మన కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజూ ఒక ఉసిరి తింటేవయస్సు సంబంధిత కంటిశుక్లం, రేచీకటి వంటి సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది.