Food
ఆల్కహాల్‌తో లివర్ మాత్రమే పాడవుతుందని అనుకుంటాం. ఆల్కహాల్ తీసుకుంటే శరీరం కాల్షియంను గ్రహించే శక్తిని కోల్పోతుంది. దీంతో ఎముకలు త్వరగా బలహీనపడి విరిగిపోయే ప్రమాదం ఉంటుంది.
ఉప్పు అధికంగా తీసుకునే వారిలో కూడా ఎముకల ఆరోగ్యం దెబ్బ తింటుందని నిపుణులు చెబుతున్నారు. ఉప్పు ఎక్కువైతే కాల్షియం లోపం ఏర్పడి, బోలు ఎములక వ్యాధికి దారి తీస్తుంది.
కెఫిన్ ఉండే టీ, కాఫీ వంటి వాటిని ఎక్కువగా తీసుకున్న ఎముకలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. కాల్షియం గ్రహించే సామర్థ్యాన్ని కెఫిన్ ప్రభావితం చేస్తుంది.
సోడా, కూల్ డ్రింక్స్ వంటివి ఎక్కువగా తీసుకున్నా ఎముకలు త్వరగా విరిగిపోతాయని అంటున్నారు. ఇలాంటి డ్రింక్స్‌లో ఉండే ఫాస్పరస్ కాల్షియంను గ్రహించే శక్తిని తగ్గిస్తుంది.
చక్కెర కంటెంట్ ఎక్కువగా ఉండే ఫుడ్‌ను తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు.
స్మోకింగ్ ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని తెలిసిందే. అయితే ఎముకల ఆరోగ్యాన్ని కూడా పొగ దెబ్బ తీస్తుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
ఈ వివరాలు కేవలం ఇంటర్నెట్ వేదికగా అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అందించినవి మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలే పాటించాలి.