Food
చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలనుకునేవారు ఖచ్చితంగా గుడ్డు తినాలి. మీరు ఈ పద్దతిలో గనుక ఎగ్ ఫ్రై చేస్తే టేస్ట్ కు టేస్ట్.. ఆరోగ్యానికి ఆరోగ్యం. మరి ఎగ్ ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాం..
ముందుగా పాన్ వేడిచేసి నూనెలో గుడ్లను అన్ని వైపులా వేయించండి. లేత బ్రౌన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయండి.
ఈ పాన్‌లోనే మిగిలిన నూనెలో పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి. తర్వాత దీంట్లో ధనియాల పొడి, కారం అన్ని మసాలా దినుసులను వేసి కలపండి.
దీంట్లో కొన్ని నీళ్లను పోయండి. దీనివల్ల మసాలా దినుసులు పాన్ కు అంటుకోకుండా ఉంటాయి. అలాగే ఉల్లిపాయను 2-3 నిమిషాలు వేయించి ఆ తర్వాత కొద్దిగా నూనె వేసి గుడ్లు వేయండి.
ఇప్పుడు దీనిలో కొన్ని నీళ్లు పోసి రెండు మూడు నిమిషాలు ఉడికించండి.ఆ తర్వాత గుడ్లకు మసాలా మొత్తం పట్టేలా కలుపుతూ ఉండండి.
టేస్టీ టేస్టీ తవా ఫ్రైడ్ ఎగ్ కర్రీ రెడీ. దీన్ని చేయడానికి పెద్దగా ఇబ్బంది అవసరం లేదు. కేవలం 10 నిమిషాల్లో అదిరిపోయే ఎగ్ ఫ్రై చేయొచ్చు. దీన్ని డిన్నర్, బ్రేక్‌ఫాస్ట్‌లో తినొచ్చు.