Food

ధర ఎక్కువని లైట్ తీసుకోకండి..

Image credits: Freepik

జీర్ణ సమస్యలు

పియర్‌ ఫ్రూట్‌లో ఫైబర్‌ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో ఉపయోగపడుతుంది. గ్యాస్‌, అజీర్ణం వంటి సమస్యలకు ఈ ఫ్రూట్‌ మంచి పరిష్కారం. 
 

Image credits: Freepik

రక్తపోటు

పియర్‌ పండులో పొటాషియం కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచడంలో ఉపయోగపడుతుంది.  

Image credits: pinterest

గుండె జబ్బులు

పియర్‌ పండు యాంటీ ఆక్సిడెంట్స్‌కు పెట్టింది పేరు. ఈ పండును రెగ్యులర్‌గా ఆహారంలో భాగం చేసుకుంటే గుండె జబ్బుల బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చు. 
 

Image credits: social media

షుగర్‌ పేషెంట్స్‌కి

డయాబెటిస్‌ పేషెంట్స్‌కి పియర్‌ పండు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పండులో ఉండే గ్లైసిమిక్‌ ఇండెక్స్ రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతాయి. 
 

Image credits: Getty

రోగ నిరోధక శక్తి

విటమిన్‌ సికి పెట్టింది పేరైన పియర్‌ ఫ్రూట్‌ను రెగ్యులర్‌గా తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తరచూ వచ్చే వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చు. 
 

Image credits: Getty

క్యాన్సర్‌కి చెక్‌

భవష్యత్తుల్లో క్యాన్సర్‌ బారిన పడకుండా ఉండాలంటే పియర్‌ ఫ్రూట్‌ను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ క్యాన్సర్‌ కణాల వృద్ధిని అడ్డుకుంటుంది. 
 

Image credits: iSTOCK

గమనిక

పైన తెలిపిన విషయాలను కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సందేహాలున్నా వైద్యులనే సంప్రదించాలి. 
 

Image credits: our own

కంటి చూపు బాగుండాలంటే.. ఇవి తినాల్సిందే

ఏ ఆహారం జీర్ణం కావడానికి ఎంత సమయం పడుతుంతో తెలుసా?

రాత్రి భోజనం తర్వాత ఏం చేయాలి?

జస్ట్ 10నిమిషాల్లో ఎగ్ ఫ్రై.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్..