Food

మందు తాగేటప్పుడు ఇవి మాత్రం తినకండి

కారం ఎక్కువగా ఉండేవి

చాలా మందికి మందు తాగేటప్పుడు స్పైసీ ఫుడ్ తినాలని ఉంటుంది. కానీ, ఈ రెండూ కలిపి తీసుకుంటే కడుపులో మంట, గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి.

 

 

వేయించిన ఫుడ్స్

సమోసా, కచోరీ లేదా ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి ఎక్కువగా వేయించిన ఆహారాలను రమ్‌తో కలిపి తీసుకోకూడదు. ఇది మీ జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది.

మిఠాయిలు లేదా చాక్లెట్లు

రమ్ రుచి తరచుగా తీపి లేదా కారమెల్ లాగా ఉంటుంది. దీనితో పాటు మిఠాయిలు లేదా చాక్లెట్లు తింటే, రుచులు కలగలిసిపోయి రమ్  అసలు రుచి దెబ్బతింటుంది.

పాల ఉత్పత్తులు

రమ్‌తో పాటు పాల ఉత్పత్తులను తీసుకోవడం కడుపుకు మంచిది కాదు. పనీర్ పకోడ వంటి పాల ఉత్పత్తులను తినకూడదు. వికారం లేదా కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది.

పుల్లని పండ్లు లేదా రసాలు

పుల్లని పండ్లు, నారింజ, నిమ్మ లేదా వాటి రసాలను రమ్‌తో కలిపి తీసుకుంటే గ్యాస్ట్రిక్ సమస్య పెరుగుతుంది. వాటి రుచుల కారణంగా రమ్  అసలు రుచి దెబ్బతింటుంది.

ఏ స్నాక్స్ తీసుకోవాలి

రమ్‌తో పాటు గ్రిల్డ్ చికెన్, చేపలు, వేయించిన గింజలు, చీజ్ ప్లాటర్, తక్కువ కారం ఉన్న కబాబ్‌లు వంటివి తీసుకోవచ్చు. మద్యం మోతాదును కూడా పరిమితం చేసుకోవాలి, లేకుంటే అది కూడా హానికరం.

పప్పుల డబ్బాలో అగ్గిపుల్ల పెడితే ఏమౌతుంది?

మటన్ రోజూ తింటే ఏమౌతుంది?

నీతా అంబానీ ఏం తింటుంది?

ఎగ్ లేకుండా, స్పాంజీ కేక్ తయారు చేసేదెలా?