Food

6 నెలలు నిల్వ ఉండే ఇన్ స్టంట్ దోశ పిండి

ఇన్ స్టంట్ దోశ పిండి ఎలా చేయాలి?

మూడు కప్పుల బియ్యం, ఒక కప్పు మినపప్పు , జీలకర్ర అర టీస్పూన్, మిరియాలు పావు టీస్పూన్, సోంపు అర టీస్పూన్, ఉప్పు రుచికి సరిపడా.

పప్పు, బియ్యం కడగాలి

మూడు కప్పుల బియ్యం, ఒక కప్పు మినపప్పును బాగా కడిగి 4-6 గంటలు నానబెట్టాలి.

ఎండలో ఆరబెట్టాలి

కడిగిన పప్పు, బియ్యాన్ని చాప మీద పరచి ఎండలో లేదా గాలిలో బాగా ఆరబెట్టాలి.

పిండిగా రుబ్బాలి

ఆరిన పప్పు, బియ్యాన్ని మిక్సీలో బాగా పొడి పిండిలా రుబ్బాలి. పిండి చాలా మెత్తగా లేదా చాలా గరుకుగా ఉండకూడదు.

మసాలాలు కలపాలి

దోశ పిండి రుచిని పెంచడానికి, జీలకర్ర, మిరియాలు, సోంపు వేసి బాగా కలపాలి. మళ్ళీ ఒకసారి మిక్సీలో రుబ్బాలి.

నిల్వ చేయండి

పిండిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో నింపి చల్లని, పొడి ప్రదేశంలో ఉంచాలి. సరిగ్గా నిల్వ చేస్తే 6 నెలల వరకు ఉపయోగించవచ్చు.

దోశలు చేసుకునే విధానం

ఒక కప్పు దోశ పిండి తీసుకుని, కొంచెం ఉప్పు, నీళ్ళు కలిపి దోశ పిండిని తయారు చేసుకోవాలి. పిండి చాలా గట్టిగా కాకుండా కొంచెం పలుచగా ఉండాలి. రుచి కోసం కొంచెం పెరుగు కూడా కలపవచ్చు.

దోశ వేయండి

నాన్‌స్టిక్ పెనం వేడి చేసి, నూనె రాసి, పిండిని పెనంపై పరచాలి. దోశ  రెండు వైపులా కాల్చాలి. దోశలోకి బంగాళాదుంప లేదా పన్నీర్ స్టఫ్ఫింగ్ కూడా వేసుకోవచ్చు.

ఇది తెలిస్తే.. కిస్ మిస్ నీళ్లు తాగకుండా అస్సలు ఉండరు

మీ లివర్ ని దెబ్బతీసే ఆహారాలు ఇవి

చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ తింటే ఏమౌతుందో తెలుసా?

పాలలో యాలకులను వేసుకుని తాగితే ఏమౌతుందో తెలుసా