Food
రాగిజావలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త ప్రసరణను మెరుగు పరిచి జుట్టు రాలడాన్ని నిరోధిస్తుంది. అలాగే జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
షుర్ పేషెంట్స్ ఎంచక్కా రాగి జావను తీసుకోవచ్చు. రాగి జావలో ఉండే పాలీఫెనాల్స్, డైటరీ ఫైబర్‌లు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో తోడ్పడుతుంది.
రాగి జావను రెగ్యులర్‌గా తీసుకొంటే శరీరంలో మంచి కొవ్వు పెరుగుతుంది. ఇది గుండె కండరాల పనితీరు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
రాగి జావ ఐరన్‌కు పెట్టింది పేరు. కాబట్టి హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న వారు, రక్త హీనతతో బాధపడేవారు రెగ్యులర్‌గా రాగి మాల్ట్‌ను తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
రాగి మాల్ట్‌లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని భాస్వరం దంతాల ఆరోగ్యాన్ని కూడా రక్షిస్తుంది.
బరువు తగ్గాలనుకుంటున్నారా.? అయితే ప్రతీ రోజూ ఉదయం టిఫిన్‌కు బదులుగా రాగి మాల్ట్‌ను తీసుకోండి. దీనిలోని ఫైబర్ కంటెంట్ త్వరగా కడుపు నిండిన భావనను కలిగిస్తుంది.
ఆందోళన, డిప్రెషన్, నిద్రలేమి వంటి సమస్యలను దూరం చేయడంలో రాగి మాల్ట్ ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్, అమైనో ఆమ్లాలు శరీరానికి విశ్రాంతిని అందిస్తాయి.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.