Food
కిస్ మిస్ వాటర్ లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఈ వాటర్ ను ఉదయాన్నే తాగితే మలబద్దకం తగ్గిపోయి మీ జీర్ణక్రియ మెరుగ్గా పనిచేస్తుంది.
కిస్ మిస్ వాటర్ లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది మీ ఎముకల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. రోజూ ఈ వాటర్ ను తాగితే ఎముకల సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారికి ఈ వాటర్ చాలా మంచిది. ఇనుము పుష్కలంగా ఉండే ఈ వాటర్ ను తాగితే ఒంట్లో రక్తం పెరుగుతుంది.
కిస్ మిస్ వాటర్ లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీర ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి బాగా సహాయపడతాయి.
నారింజతో కూడిన కిస్మిస్ లు శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి.
అవును కిస్ మిస్ వాటర్ బరువు తగ్గాలనుకునే వారికి కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ వాటర్ శరీరంలో కొవ్వును తగ్గించి మీరు బరువు తగ్గడానికి సహాయపడతాయి.
కిస్ మిస్ వాటర్ మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న ఈ వాటర్ చర్మానికి చాలా మంచివి.