Food
40ఏళ్ల తర్వాత మహిళల్లో ఎముకల బలహీనత సమస్య మొదలౌతుంది.
ఎముకల ఆరోగ్యం కోసం పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి.
ఒమేగా 3 కలిగిన చేపలు ఎముకలకు మంచివి.
చియా, ఫ్లాక్స్ గింజలు ఎముకలను బలపరుస్తాయి.
పాల ఉత్పత్తుల్లో కాల్షియం, విటమిన్ డి ఉంటాయి. ఇవి ఎముకలకు మంచివి.
బెర్రీ పండ్లు విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి. ఇవి ఎముకలకు మంచివి.
చిలగడదుంపలో విటమిన్ ఎ, సి, పొటాషియం వంటివి ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి మంచివి.