Food
డయాబెటీస్ పేషెంట్లకు ఓట్స్ చాలా మంచివి. వీటిలో ఫైబర్, బీటా-గ్లూకాన్ పుష్కలంగా ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ ను, కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
ఓట్స్ మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా బాగా సహాయపడుతుంది.ఓట్స్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. గుండెను హెల్తీగా ఉంచుతుంది.
ఓట్స్ బరువు తగ్గడానికి కూడా బాగా సహాయపడుతుంది. ఎందుకంటే దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ ఆకలిని తగ్గించి మీరు ఎక్కువగా తినకుండా చేస్తుంది. అన్నానికి బదులు ఓట్స్ ను తింటే బరువు తగ్గుతారు.
ఓట్స్ ను తింటే మలబద్దకం సమస్య కూడా తగ్గుతుంది. ఓట్స్ లో ఉండే ఫైబర్ కంటెంట్ మలబద్దకం సమస్యను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.
ఓట్స్ ఆరోగ్యానికి మాత్రమే కాదు.. అందానికి కూడా ఉపయోగపడుతుంది. ఓట్స్ లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని హెల్తీగా ఉంచుతాయి.
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఓట్స్ ను రోజూ తినడం వల్ల మనకు డయాబెటీస్ వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. ఇది షుగర్ ను కంట్రోల్ లో ఉంచుతుంది.
ఓట్స్ లో మన శరీరానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలుంటాయి. ముఖ్యంగా విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి షుగర్ వ్యాధిని నియంత్రించడానికి సహాయపడతాయి.