Food

జ్వరం వచ్చినప్పుడు చికెన్‌ తినొచ్చా.. తింటే ఏమవుతుంది.?

Image credits: pexels

సందేహాలు

జ్వరం వచ్చినప్పుడు చాలా సందేహాలు ఉంటాయి. ముఖ్యంగా ఎలాంటి ఫుడ్‌ తీసుకుంటే ఏమవుతుందో అన్న అనుమానాలు ఉండడం కామన్‌. 
 

Image credits: Getty

చికెన్‌ తినొచ్చా..

జ్వరం ఉన్నప్పుడు చికెన్‌ తినొచ్చా అనే సందేహం రావడం సర్వసాధారణం. ఇంతకీ నిపుణులు ఏం చెబుతున్నారంటే. 
 

Image credits: pinterest

తినొచ్చు కానీ..

జ్వరం ఉన్న సమయంలో చికెన్‌ తినొచ్చని వైద్యులు చెబుతున్నారు. అయితే చికెన్‌ తీసుకునే విధానాన్ని మార్చుకోవాలని సూచిస్తున్నారు

Image credits: Getty

మసాలాలు

జ్వరం సమయంలో జీర్ణక్రియ మందగిస్తుంది. కాబట్టి చికెన్‌ను మసాలాలు, కారం ఎక్కువగా లేకుండా వండుకోవాలి. 
 

Image credits: pexels

సూప్‌ రూపంలో

చికెన్‌ను సూప్‌ రూపంలో తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. త్వరగా జీర్ణమవ్వడంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 
 

Image credits: Freepik

మితంగా తినాలి

జ్వరం వచ్చిన సమయంలో జీర్ణ శక్తి తగ్గుతుంది. కాబట్టి చికెన్‌ను మితంగా తీసుకోవాలి. తక్కువ మొత్తంలో తీసుకుంటే త్వరగా జీర్ణమవుతుంది. 

Image credits: Pinterest

కోడిగుడ్లు

జ్వరం వచ్చిన సమయంలో కోడిగుడ్లు తింటే జాండిల్స్‌ అవుతాయని కొందరి నమ్ముతుంటారు. అయితే ఇందులో నిజం లేదు. ఉడకబెట్టిన గుడ్డును తినొచ్చు. 
 

Image credits: Getty

గమనిక

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. 

Image credits: our own

చలికాలంలో నల్ల నువ్వుల లడ్డు ఒక్కటి తిన్నా చాలు

రోజూ ఒక గుడ్డును ఖచ్చితంగా తినాలా?

ఓట్స్ ను రోజూ తినొచ్చా? తింటే ఏమౌతుంది?

కిడ్నీల్లో రాళ్లకు ఈ ఆహారమే కారణం..