Food
కంటి ఆరోగ్యం కోసం విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆరెంజ్‌ను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కంటి చూపును మెరుగుపరచడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
కంటి సమస్యలకు చెక్ పెట్టడంలో చేపలు ఉపయోగపడతాయి. ఇందులోని విటమిన్ ఏ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కంటి సమస్యలను దరిచేరనివ్వవు.
కోడి గుడ్డులోని పచ్చసొనలో ఉండే ల్యూటిన్ రెటీనాను హానికరమైన కిరణాల నుంచి రక్షిస్తుంది. అందుకే రోజుకో గుడ్డును ఆహారంలో భాగం చేసుకోమని నిపుణులు చెబుతుంటారు.
కంటి ఆరోగ్యాన్ని కాపాడడంలో బీట్రూట్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్స్ కంటి ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
క్యారెట్ తింటే కళ్లు బాగుంటాయని మనందరికీ తెలిసిందే. ఇందులోని బీటా కెరోటిన్ రెటీనా ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుందని వైద్యులు చెబుతుంటారు.
ఆకు కూరలు కూడా కంటి ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. వీటిలోని విటమిన్ ఏ, లుటిన్ కంటి కండరాలను బలోపేతం చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.
వయసుతో పాటు కంటి సంబంధిత సమస్యలు రాకుండా ఉండాలంటే బాదంను కచ్చితంగా తీసుకోవాలి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ దృష్టిని మెరుగుపరుస్తాయి.
పైన తెలిపిన విషయాలు ఇంటర్నెట్ వేదికగా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించినవి మాత్రమే. ఆరోగ్య సమస్యల కోసం వైద్యులను సంప్రదించడమే ఉత్తమం.