Food

గుమ్మడి గింజలు తినడం వల్ల మనకు ఏం జరుగుతుందో తెలుసా?

Image credits: Getty

గుమ్మడి గింజలు

గుమ్మడి గింజల్లో మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన ప్రోటీన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. 

Image credits: Getty

PCOS లక్షణాలు తగ్గిస్తాయి

ఆడవాళ్లు గుమ్మడి గింజల్ని తింటే హార్మోన్ల ఉత్పత్తి మెరుగుపడుతుంది. దీనికి అవసరమైన జింక్ వీటిలో పుష్కలంగా ఉంటుంది. గుమ్మడి గింజల్ని తింటే PCOS లక్షణాలు తగ్గుతాయి. 

Image credits: Getty

గుండె ఆరోగ్యానికి మేలు

గుమ్మడి గింజల్ని తింటే మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. దీనిలో హార్ట్ ను ఆరోగ్యంగా ఉంచే హెల్తీ ఫ్యాట్స్, ఫైబర్ మెండుగా ఉంటాయి. 

Image credits: Getty

రక్తంలో చక్కెర నియంత్రణ

గుమ్మడి గింజలు డయాబెటీస్ పేషెంట్లకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ గింజల్ని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ లో ఉంటాయి. 

Image credits: Getty

రోగనిరోధక శక్తి పెంచుతాయి

గుమ్మడి గింజల్లో పుష్కలంగా ఉండే జింక్, విటమిన్ ఇ లు మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి బాగా ఉపయోగపడతాయి. దీంతో మనం ఎన్నో రోగాలకు దూరంగా ఉంటాం. 

Image credits: Getty

మానసిక ఒత్తిడి తగ్గిస్తుంది

గుమ్మడి గింజలు మన శారీరక  ఆరోగ్యాన్ని మాత్రమే కాదు మానసిక ఆరోగ్యాన్ని కూడా హెల్తీగా ఉంచుతుంది. వీటిలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం మానసిక ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది.

Image credits: Getty

బరువు తగ్గడానికి సహాయపడుతుంది

బరువు తగ్గాలనుకునేవారికి కూడా గుమ్మడి గింజలు సహాయపడతాయి. వీటిలో ఉండే ఫైబర్ కంటెంట్ శరీరంలో పేరుకుపోయిన ఫ్యాట్ ను తగ్గించి మీరు బరువు తగ్గేలా చేస్తుంది. 

Image credits: Getty

నిద్ర మెరుగుపరుస్తుంది

రాత్రిపూట నిద్రపట్టని వారికి కూడా గుమ్మడి గింజలు బాగా ఉపయోగపడతాయి. రోజూ కొన్ని గుమ్మడి గింజల్ని తినడం వల్ల మీకు బాగా నిద్రపడుతుంది. 

Image credits: Getty

ఆరోగ్యంగా ఉండాలా? ఇది రోజూ ఒక గ్లాస్‌ తాగండి చాలు..

దొండకాయ తింటే నిజంగానే మతి మరపు వస్తుందా.?

6 నెలలు నిల్వ ఉండే ఇన్ స్టంట్ దోశ పిండి

ఇది తెలిస్తే.. కిస్ మిస్ నీళ్లు తాగకుండా అస్సలు ఉండరు