Entertainment
కల్కి సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ 200 కోట్లకు, నెట్ఫ్లిక్స్ 175 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో మొత్తం 375 కోట్లకు సినిమా అమ్ముడైంది.
రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఓటీటీ హక్కులు 350 కోట్లకు అమ్ముడయ్యాయి.
యష్ నటించిన కేజీఎఫ్ సినిమా రెండవ భాగం ఓటీటీ హక్కులు 320 కోట్లకు అమ్ముడయ్యాయి.
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ 275 కోట్లకు కొనుగోలు చేసింది.
షారుఖ్ ఖాన్, నయనతార నటించిన జవాన్ సినిమా ఓటీటీ హక్కులు 250 కోట్లకు అమ్ముడయ్యాయి.
ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ 250 కోట్లకు కొనుగోలు చేసింది.
ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సలార్ సినిమా ఓటీటీ హక్కులు 162 కోట్లకు అమ్ముడయ్యాయి.
విజయ్ నటించిన లియో సినిమా ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ 120 కోట్లకు కొనుగోలు చేసింది.
షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా ఓటీటీ హక్కులు 100 కోట్లకు అమ్ముడయ్యాయి.
శివ దర్శకత్వంలో సూర్య నటించిన కంగువా సినిమా 100 కోట్లకు అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికకు అమ్ముడైంది.