Entertainment

భూకంపం నేపథ్యంలో వచ్చిన టాప్-10 సినిమాలు ఏంటో తెలుసా?

భూకంప సినిమాలు

నేపాల్ భూకంపం అందరినీ భయాందోళనలకు గురిచేసింది. అలాంటి భయానక భూకంపాల ఆధారంగా రూపొందిన చిత్రాల్లో టాప్-10 సినిమాల గురించిన ఆసక్తికర విషయాలు మీకోసం.. 

1. శాన్ ఆండ్రియాస్

2015 లో విడుదలైన శాన్ ఆండ్రియాస్ భూకంపం ఆధారిత వచ్చిన సినిమా. కాలిఫోర్నియాలో ఒక పెద్ద భూకంపం నుండి ఒక రెస్క్యూ పైలట్ తన కుటుంబాన్ని ఎలా కాపాడాడో ఇది చూపిస్తుంది.

2. ది ఇంపాజిబుల్

2012లో వచ్చిన ది ఇంపాజిబుల్ సినిమా నిజ జీవిత కథ ఆధారంగా రూపొందించారు. 2004లో వచ్చిన సునామీ నుంచి ప్రాణాలతో బయటపడటానికి ఒక కుటుంబం చేసిన పోరాటాన్ని ఈ సినిమాలో చూపించారు.

3. ది క్వేక్

2018 చిత్రం ది క్వేక్ ఆస్లోలో సంభవించిన భారీ భూకంపం ఆధారంగా రూపొందింది. ఈ చిత్రం 2015 చిత్రం ది వేవ్ కి సీక్వెల్ గా వచ్చింది.

3. ఎర్త్ క్వేక్ (1974)

1974లో వచ్చిన ఎర్త్ క్వేక్ సినిమా లాస్ ఏంజిల్స్‌లో ఒక పెద్ద భూకంపం తర్వాత జరిగిన విధ్వంసాన్ని వెండితెరపై కళ్లముందు చూపించింది.

4. 2012

2012 సినిమా భూకంపాలు సహా అనేక ప్రపంచ విపత్తులను  చూపించింది.  ఈ చిత్రం ప్రజలు తమ ఉనికి కోసం చేసిన పోరాటం కథ ఆధారంగా రూపొందించారు.

5. ఆఫ్టర్‌షాక్

న్యూయార్క్ నగరంలో ఒక పెద్ద భూకంపం తర్వాత జరిగిన పరిణామాలను ఆఫ్టర్‌షాక్: ఎర్త్‌క్వేక్ ఇన్ న్యూయార్క్ చిత్రంలో ఆసక్తికరంగా చూపించారు. 

6. వోల్కానో

1997 లో వచ్చిన వోల్కానో చిత్రం భూకంపం తర్వాత లాస్ ఏంజిల్స్‌లో అగ్నిపర్వతం బద్దలవ్వడాన్ని, దానివల్ల కలిగిన భయాందోళనలను చూపించింది.

7. డాంటెస్ పీక్

1997 లో విడుదలైన డాంటెస్ పీక్ చిత్రం ప్రత్యేకంగా అగ్నిపర్వత విస్పోటనాలను  చూపించింది. 

9. ట్రెమర్స్

1990లో వచ్చిన ట్రెమర్స్  సినిమా ఒక హర్రర్-కామెడీ. భూకంప కార్యకలాపాల నుండి పుట్టిన భూగర్భ జీవుల ప్రభావాన్ని ఇది చూపించింది.

10. అండ్ లైఫ్ గోస్ ఆన్

1992 లో వచ్చిన అండ్ లైఫ్ గోస్ ఆన్ అనే చిత్రం 1988 అర్మేనియన్ భూకంపం తర్వాత జీవితాన్ని చూపించింది.

`దేవర` నటుడి కూతురు డేటింగ్‌ లిస్ట్ తెలిస్తే మైండ్‌ బ్లాక్‌

`కల్కి` నటి దీపికా పదుకొనే 6 విలువైన వస్తువులేంటో తెలుసా?

స్కై ఫోర్స్: అక్షయ్ కుమార్ పవర్ఫుల్ డైలాగ్స్

దీపికా పదుకొనె నుంచి రాబోతున్న చిత్రాలు.. క్రేజీ సీక్వెల్స్ ఇవే