3 నిమిషాల పాట కోసం రూ. 5 కోట్లు.. సామ్‌తో మాములుగా ఉండదు
Image credits: Instagram
ఏం మాయ చేశావేతో
ఏం మాయ చేశావే సినిమాతో వెండి తెరకు పరిచయమైంది అందాల తార సమంత అనతి కాలంలోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది.
Image credits: Instagram
దాదాపు అందరు అగ్ర హీరోలతో
ఈ బ్యూటీ దాదాపు అందరు అగ్ర హీరోల సరసన నటించి భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుంది. అనంతరం నాగ చైతన్యను వివాహం చేసుకుని అక్కినేని కోడలుగా మారింది.
Image credits: Pinterest
ఇబ్బందులు
అంతా సాఫీగా సాగుతోంది అనుకుంటున్న సమయంలో వైవాహిక జీవితంలో ఎదురైన సంఘటనలు సామ్ జీవితాన్ని ఒక్కసారిగా మార్చేశాయి.
Image credits: Instagram
ఆరోగ్యం
వైవాహిక జీవితం నుంచి బయటకు రావడం ఆ తర్వాత మయోసైటిస్ బారిన పడడం తీవ్ర ఇబ్బందికి గురి చేశాయి. అయితే బౌన్స్ బ్యాక్ అయిన సమంత మళ్లీ కెరీర్లో ముందుకు సాగుతోంది.
Image credits: Instagram
పుష్ప1లో
కొన్ని రోజుల పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సమంత పుష్ప1లో 'ఊ అంటావా' అనే పాటతో మళ్లీ అందరి దృష్టిని ఆకర్షించిందీ చిన్నది.
Image credits: facebook
రెమ్యునరేషన్
3 నిమిషాల నిడివి ఉండే ఈ పాటకు సమంత ఏకంగా రూ. 5 కోట్లు తీసుకుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు.
Image credits: Pinterest
సిటాడెల్
తాజాగా సిటాడెల్ వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. కాగా సామ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు.