Entertainment
3 మూవీకి ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. మానసిక సమస్యతో బాధపడే పాత్రలో ధనుష్ ఈ సినిమాలో అద్భుత నటనను కనబరిచాడు.
శృతీహాసన్ కూడా ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. డీ గ్లామర్ పాత్రలో నటించి మెప్పించింది. థియేటర్‌లో పెద్దగా హిట్ అవ్వకపోయినా బుల్లి తెరపై మాత్రం సందడి చేసింది.
ఇక ఈ సినిమాలో వచ్చే వై దిస్ కొవలెరి సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ఓ ఊపు ఊపేసిన విషయం తెలిసిందే. ఏ పార్టీ జరిగినా కచ్చితంగా ఈ పాట ఉండాల్సిందే అన్నట్లు పరిస్థితి మారింది.
ఇక ఈ సినిమాలో హీరో, హీరోయిన్‌తో పాటు శృతీ హాసన్ చెల్లిగా నటించిన చిన్నారి కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. గాబ్రియెల్లా నటాలీ చార్ట్లన్ బాలనటిగా ఇందులో నటించింది.
బాల నటిగా ప్రేక్షకులను మెప్పించిన గాబ్రియెల్లా పలు డాన్స్ రియాల్సిటీ షోలతోనూ ఆకట్టుకుంది. ఆ తర్వాతే 3 మూవీలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది.
3 మూవీ విడుదలైన మూడేళ్ల తర్వాత గాబ్రియెల్లా నటాలీ హీరోయిన్‌గా మారింది. అప్పా మూవీలో రషిత పాత్రలో నటించి మెప్పించింది. తర్వాత చదువు కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. ప్రస్తుతం ఈ హీరోయిన్‌కు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అందానికే అసూయ పుట్టేలా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.