Cricket

టీమిండియా సాధించిన 6 కొత్త రికార్డులు ఇవే

Image credits: X

చారిత్రాత్మక విజయాలు

చరిత్రలో తొలిసారిగా, భారత క్రికెట్ జట్టు టెస్టుల్లో ఓటముల కంటే ఎక్కువ విజయాలు సాధించింది. 

మొత్తం మ్యాచ్‌లు- 580

విజయాలు- 179

ఓటములు- 178

డ్రాలు- 222

టై-1

Image credits: X

అశ్విన్ బ్యాటింగ్, బౌలింగ్ సునామీ

ఒకే టెస్టులో సెంచరీ, 5 వికెట్లు తీసిన నాలుగో ఆటగాడిగా అశ్విన్ నిలిచాడు. ఈ జాబితాలో ఇయాన్ బోథమ్ టాప్ లో ఉన్నాడు.

Image credits: X

400 వికెట్లు తీసిన బుమ్రా

అంతర్జాతీయ క్రికెట్‌లో 400 వికెట్లు తీసిన ఆరో భారత ఫాస్ట్ బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. చెన్నై టెస్టులో 5 వికెట్లు తీసి.. తన వికెట్ల సంఖ్యను 402కు పెంచుకున్నాడు.

Image credits: Getty

అశ్విన్ & జడేజా రికార్డు భాగస్వామ్యం

తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 144/6తో తడబడుతున్న దశలో అశ్విన్, జడేజా జోడి కలిసింది. వీరిద్దరూ ఏడో వికెట్‌కు నమోదు చేసిన 199 పరుగుల భాగస్వామ్యం చెన్నై వేదికగా అత్యధికం.

Image credits: X

ధోని రికార్డు సమం చేసిన పంత్

చెన్నై వేదికగా తన ఆరో టెస్టు సెంచరీ పూర్తి చేశాడు పంత్. దీంతో టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ధోని రికార్డును పంత్ సమం చేశాడు.

Image credits: X

హసన్ ముహమ్మద్ రికార్డు

టెస్టుల్లో ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన తొలి బంగ్లాదేశ్ బౌలర్‌గా హసన్ ముహమ్మద్ నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 83 పరుగులకు 5 వికెట్లు తీసుకున్నాడు.  

Image credits: X
Find Next One