business

ప్రపంచ స్థాయిలో వందేభారత్‌ స్లీపర్‌ కోచ్‌లు.. ఫొటోలు చూస్తే ఫిదా అంతే

వందే భారత్ స్లీపర్ కోచ్‌లు రడీ

దేశంలోని లగ్జరీ రైళ్లలో ఒకటైన వందే భారత్ త్వరలోనే స్లీపర్ కోచ్‌లను తీసుకురానుంది. ఇందుకు సంబంధించి ఇప్డపటికే స్లీపర్ కోచ్‌ల తయారీ పూర్తయ్యింది. 

కోటలో వందే భారత్ ట్రయల్స్

వందే భారత్‌ స్లీపర్ కోచ్ లకు సంబంధించిన త్వరలోనే రాజస్థాన్‌లోని కోటలో ట్రయల్స్ నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అయితే ఇందుకు సంబంధించి అధికారిక తేదీ ప్రకటించాల్సి ఉంది. 

180 కి.మీ. వేగంతో దూసుకెళ్లనున్న రైలు

ఢిల్లీ-ముంబై రైలు మార్గంలో కూడా మిషన్ రఫ్తార్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ఈ మార్గంలో రైలు గంటకు ఏకంగా 180 కిలోమీటర్ల వేగంతో నడిపించనున్నారు. 

ప్రయాణికులకు విమానంలాంటి సౌకర్యాలు

ప్రయాణికులకు విమానంలాంటి సౌకర్యాలు కల్పించడానికి వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు రైల్వే స్లీపర్ కోచ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 

యూరోపియన్ రైళ్ల తరహాలో...

రైల్వే వర్గాల సమాచారం ప్రకారం, ఈ స్లీపర్ కోచ్‌లను యూరోపియన్ దేశాల్లో నడిచే రైళ్ల తరహాలో డిజైన్ చేశారని అధికారులు చెబుతున్నారు. 

కప్లింగ్ ఏర్పాటు

ఈ స్లీపర్ కోచ్ లో 11 థర్డ్ AC కోచ్‌లు, 4 సెకండ్ AC కోచ్‌లు, ఒక ఫస్ట్ AC కోచ్ ఉంటుంది. రైలు ప్రయాణం సమయంలో ఎలాంటి జర్క్స్ లేకుండా ఉండేందుకు కప్లింగ్ ను ఏర్పాటు చేశారు. 

ప్రపంచంలో ఇంతకంటే ఖరీదైన కార్లు మీరు చూడలేరు

పోస్టాఫీస్‌లో ఎక్కువ వడ్డీ ఇచ్చే బెస్ట్ స్కీమ్ ఇదే

Tata నుంచి వచ్చిన 7 అద్భుతమైన కార్లు ఇవే

ఎల్ఐసీలో క్లెయిమ్ చేయని పాలసీ డబ్బు అన్ని వందల కోట్లు ఉందా?