business
రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పటికే మెటియోర్, హంటర్, క్లాసిక్, బుల్లెట్ వంటి మోడళ్లను J-సిరీస్ ఇంజిన్ లైనప్‌లో ప్రవేశపెట్టింది.
స్టైలింగ్ పరంగా రాయల్ ఎన్ఫీల్డ్ గోవాన్ క్లాసిక్ 350 క్లాసిక్ 350 లుక్ ని కలిగి ఉంటుంది.
పెట్రోల్ ట్యాంక్, సైడ్ ప్యానెల్లు, హెడ్‌ల్యాంప్ యూనిట్ మునుపటి వెర్షన్ మాదిరిగానే ఉంటాయి.
రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450, ఇంటర్‌సెప్టర్ బేర్ 650లలో అందించిన వాటి మాదిరిగానే ఆకర్షణీయ రంగుల్లో ఉంటుంది.
అదే 348cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ మిల్లు బైక్‌కు శక్తినిస్తుంది. గరిష్టంగా 20.7 bhp, 27 Nm పీక్ టార్క్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఇది ఉంటుంది.
బ్రేకింగ్ సిస్టమ్ కోసం రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లను అమర్చారు. బ్రేక్ వేయగానే బండి నిలబడిపోతుంది.
లాంచ్ అయిన తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ గోవాన్ క్లాసిక్ 350 బాబర్ సెగ్మెంట్లో జావా పెరాక్‌తో పోటీ పడుతుంది.