business
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఉన్న ఉమైద్ భవన్ ప్యాలెస్ భారతదేశంలో అత్యంత ఖరీదైన 5-స్టార్ హోటల్.
పార్ట్ హోటల్, పార్ట్ మ్యూజియం అయిన ఈ ప్యాలెస్ హోటల్ విభాగాన్ని టాటా గ్రూప్ నిర్వహిస్తోంది.
మహారాజా ఉమైద్ సింగ్ పేరును ప్రస్తుత యజమాని అయిన గజ్ సింగ్ ఈ హోటల్‌కు పేరు పెట్టారు.
భారతదేశంలో ఆరవ అత్యంత ఖరీదైన ఆస్తి గా ఉమైద్ భవన్ ప్యాలెస్ నిలిచింది.
ఈ ప్యాలెస్ 1929, 1943 మధ్య బ్రిటిష్ ఆర్కిటెక్ట్ హెన్రీ లాంచెస్టర్ రూపొందించారు.
ఈ ప్యాలెస్ 26 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. వీటిలో 15 ఎకరాల (6.1 హెక్టార్లు) తోట ఉంది.
347 గదులున్న ఈ హెటల్ లో ఒక రాత్రి స్టే చేయాలంటే రూ.41,000 నుండి రూ.4,00,000 వరకు ఖర్చు పెట్టాలి. అంటే ఒక ఉద్యోగి జీతంతో సమానం.
ఈ ప్యాలెస్‌లో సింహాసన గది, ప్రైవేట్ డ్రాయింగ్ రూములు, దర్బార్ హాల్, గుమ్మటం బ్యాంక్వెట్ హాల్, బాల్ రూమ్, లైబ్రరీ, ఇండోర్ పూల్, స్పా తదితర సౌకర్యాలు ఉన్నాయి.
ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో 70 అద్భుతమైన సూట్ రూమ్స్, గదులు ఉన్నాయి. 1943లో నిర్మాణం పూర్తయింది. అప్పుడు దాని నిర్మాణ వ్యయం రూ.1.10 కోట్లు.