business

మధ్య తరగతి వ్యక్తి కోటీశ్వరు కావడం సాధ్యమే.. ఎలాగో తెలుసా?

Image credits: Freepik

త్వరగా మొదలుపెట్టండి

మన రెగ్యులర్ ఇన్ కమ్ తో పాటు షేర్ మార్కెట్లో పెట్టుబడం అలవాటు చేసుకోవాలి. దీర్ఘకాల ప్రణాళికతో SIPలో పెట్టుబడి పెడుతూ ఉండాలి. అయితే దీనిని ఎంత త్వరగా ప్రారంభిస్తే అంత మంచిది. 

Image credits: Freepik

క్రమం తప్పకుండా పెట్టుబడి

SIPలో మీరు పెట్టుబడి పెట్టేది ఎంతైనా అవ్వొచ్చు. క్రమంతప్పకుండా పెట్టుబడి పెడుతూ ఉండాలి. ప్రతీ నెలా ఒక నిర్ణీత మొత్తాన్ని ఇందుకోసం కచ్చితంగా కేటాయించేలా చూసుకోండి. 

Image credits: freepik

ఎక్కువ రాబడి

అయితే మ్యూచువల్ ఫండ్స్ ను ఎంచుకునే విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా 12 నుంచి 15 శాతం వార్షిక రాబడి అందించే మ్యూచువల్ ఫండ్స్ లోనే పెట్టుబడి పెట్టాలి. 

Image credits: freepik

దీర్ఘకాల లక్ష్యం

అయితే వెంటనే ప్రతిఫలం వస్తుందన్న అంచనాలు ఉండకుండా దీర్ఘకాల లక్యం పెట్టుకోవాలి. మంచి రిటర్న్స్ రావాలంటే కనీసం 25 నుంచి 30 ఏళ్లు పెట్టుబడి పెడుతూ వెళ్లాలి. 

Image credits: freepik

SIP పెంచండి

ఇక మీ రిటర్న్స్ పెరగాలంటే మీరు పెట్టుబడి పెడుతున్న మొత్తాన్ని క్రమంగా పెంచుతూ వెళ్లాలి. పెరుగుతోన్న మీ ఆదాయానికి అనుగుణంగా మీ SIP మొత్తాన్ని ప్రతీ ఏటా పెంచే ప్రయత్నం చేయాలి. 

Image credits: freepik

మధ్యలో విత్ డ్రా చేయొద్దు..

మీరు పెట్టుబడి పెడుతోన్న మొత్తం నిరంతరం వృద్ధి చెందాలంటే ఎట్టి పరిస్థితుల్లో మధ్యలో విత్ డ్రా చేయకూడదు. చాలా మంది కొన్ని రోజులకే విత్ డ్రా చేస్తుంటారు. అయితే ఇలా చేయొద్దు. 

Image credits: freepik

కాలిక్యులేటర్లు వాడండి

ఉదాహరణకు మీరు ఒక 30 ఏళ్లలో కోటి రూపాయలు జమా చేయాలని అనుకుంటే. నెలకు ఎంత పెట్టుబడి పెట్టాలన్న విషయాన్ని ముందుగా లెక్క కట్టండి. ఇందుకోసం ఆర్థిక నిపుణులు సూచనలు తీసుకోండి. 

Image credits: freepik

నెలకు రూ. 5 వేలు

నెలకు రూ. 5 వేల చొప్పున క్రమం తప్పకుండా కనీసం 15% రాబడి వచ్చే ఫండ్స్ లో పెట్టుబడి పెడుతూ వెళ్తే. 30 ఏళ్లలో కోటి రూపాయలు సంపాదించడం సులువైన విషయమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 

Image credits: Getty

గమనిక

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. మార్కెట్ పెట్టుబడులు అనేవి రిస్క్ తో కూడుకుని ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. పెట్టుబడి పెట్టే ముందు అన్ని ఆలోచించుకోవాలి. 

Image credits: Freepik

గూగుల్ మ్యాప్స్‌లో మీ ఇంటిని చూడాలని ఉందా? ఇలా చేయండి

4 లక్షల వరకు ఆదాయపు పన్ను ఇలా ఆదా చేసుకోవచ్చు !

ఆ హోటల్‌లో ఒక రాత్రి స్టే చేయాలంటే నెల జీతం ఇచ్చేయాల్సిందే

వారానికి 90 గంటలు ఏ దేశంలో పని చేస్తారో తెలుసా?