business
బుర్జ్ ఖలీఫా ఎత్తు 828 మీటర్లు. ఇందులో 163 అంతస్తులు, 58 లిఫ్ట్‌లు, 2,957 పార్కింగ్ స్థలాలు, 304 హోటల్ గదులు, 37 ఆఫీస్ అంతస్తులు, 900 లగ్జరీ అపార్ట్‌మెంట్లు ఉన్నాయి.
9-16 అంతస్తులలోని అర్మానీ రెసిడెన్సెస్ లో విలాసవంతమైన సింగిల్, డబుల్ బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. 45-108 అంతస్తులలో 1 టు 4 బెడ్‌రూమ్ ప్రైవేట్ అపార్ట్‌మెంట్లు ఉన్నాయి.
రిపోర్ట్, దుబాయ్ హౌసింగ్ వెబ్‌సైట్ ప్రకారం 1 BHK - రూ.3.73 కోట్లు(ఇండియన్ కరెన్సీలో), 2 BHK - రూ.5.83 కోట్లు, 3 BHK - రూ.14 కోట్లు.
21,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న అతిపెద్ద పెంట్‌హౌస్ ధర ఇండియన్ రూపాయల్లో సుమారు రూ.240 కోట్లు. ఇందులో అనేక లగ్జరీ సౌకర్యాలు ఉన్నాయి.
ఢిల్లీలోని పృథ్వీరాజ్ రోడ్‌లో ఇళ్ల ధర రూ.100-150 కోట్లు. జోర్ బాగ్ 1-4 BHK ఫ్లాట్‌ల ధర రూ.5-35 కోట్ల మధ్య ఉంది. డిఫెన్స్ కాలనీలో 3-4 BHK ఫ్లాట్‌లు రూ.7-10 కోట్లు పలుకుతున్నాయి.
ముంబైలోని ఫ్లాట్‌లు రూ.2 కోట్ల నుండి ప్రారంభమవుతాయి. ఇటీవల మలబార్‌హిల్ అపార్ట్‌మెంట్ రూ.369 కోట్లకు అమ్ముడైంది. దేవవ్రత డెవలపర్లు 5 లగ్జరీ ఫ్లాట్‌లను రూ.113 కోట్లకు కొన్నారు.