వాస్తు ప్రకారం..చెప్పులు చెప్పులను తప్పుడు ప్రదేశంలో పెడితే మీకు అదృష్టం కలగకుండా చేస్తాయి. అందుకే వాస్తు ప్రకారం.. ఇంట్లో చెప్పులను ఎక్కడ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
చెప్పుల నుంచి ప్రతికూల శక్తి
చాలా మంది ఇంటి ప్రధాన గుమ్మం దగ్గరే చెప్పులను వదులుతారు. అక్కడే వేసుకుంటారు. దీంతో అక్కడ చెప్పులు కుప్పగా పోగవుతాయి. కానీ ఇది మీ ఇంటికి ప్రతికూల శక్తిని సృష్టిస్తుంది.
ఇంట్లో వారిపై చెడు ప్రభావం
వాస్తు ప్రకారం.. చెప్పుల నుంచి వచ్చే ప్రతికూల శక్తి మీ ఇంటిపై చెడు ప్రభావాన్నిచూపుతుంది. ఇంట్లో వాళ్లు ఏ పని మొదలుపెట్టినా ముందుకు సాగదు. ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం దెబ్బతింటుంది.
ప్రధాన గుమ్మ
చాలా మంది ఇంటి ప్రధాన గుమ్మం వద్దే షూ రాక్ ను పెడుతుంటారు. కానీ ఇలా అస్సలు చేయొద్దు. ఎందుకంటే ఇది మీకు లేనిపోని సమస్యలు వచ్చేలా చేస్తుంది.
సమస్యలను ఎదుర్కోవాల్సి రావొచ్చు
వాస్తు ప్రకారం.. ప్రధాన గుమ్మం నుంచే సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. కాబట్టి అక్కడ దుర్వాసన, మురికి ఉండకూడదు. దీనివల్ల మీరు ఇంట్లో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
చెప్పులను ఎక్కడ పెట్టాలి?
వాస్తు ప్రకారం.. చెప్పులను, బూట్లను ఎప్పుడైనా సరే ఇంటి దక్షిణ లేదా పశ్చిమ దిశలో ఉంచాలి. దీన్ని ఉత్తమ దిశగా భావిస్తారు. ఇలా పెట్టడం వల్ల మీకు ఎలాంటి సమస్యలు రావు.