Astrology

సూర్యాస్తమయం తర్వాత ఈ వస్తువులను దానం చేస్తున్నారా.? ఇబ్బందులు తప్పవు

Image credits: adobe stock

పాలు

సూర్యాస్తమయం తర్వాత పాలు దానం చేయకూడదని పండితులు చెబుతున్నారు. తెలుపు రంగు చంద్రుడికి సంబంధించినది కాబట్టి దానం చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందని అంటారు. 

Image credits: Freepik

పెరుగు

సూర్యాస్తమయం తర్వాత పెరుగు దానం చేయకూడదని పండితులు సూచిస్తుంటారు. ఎందుకంటే పెరుగు శుక్ర గ్రహానికి సంబంధించింది కావడమే. 

Image credits: Getty

పసుపు

పసుపు ఐశ్వర్యానికి చిహ్నం కాబట్టి సూర్యాస్తమయం తర్వాత దానం చేయకండి. రాత్రుళ్లు పసుపు దానం చేస్తే ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అంటున్నారు. 

Image credits: Getty

డబ్బు

సూర్యాస్తమయం తర్వాత ఎవరికీ డబ్బు దానంగా లేదా అప్పుగా ఇవ్వకూడదని శాస్త్రం చెబుతోంది. ఇది కూడా ఆర్థికంగా ఇబ్బందులకు దారి తీస్తుందని చెబుతున్నారు. 

Image credits: Our own

తులసి మొక్క

సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్కను ముట్టుకోకూడదు. అంతేకాదు సాయంత్రం తులసి మొక్కను ఎవరికీ ఇవ్వకూడదు ఇలా చేస్తేఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. 

Image credits: Getty

వెల్లుల్లి, ఉల్లి

సూర్యాస్తమయం తర్వాత ఎవరికీ ఉల్లిపాయలు, వెల్లుల్లి ఇవ్వకూడదని శాస్త్రం చెబుతోంది. ఇది కూడా ఆర్థిక ఇబ్బందులకు దారి తీస్తుందని అంటున్నారు. 

Image credits: Getty

ఇవి కూడా చేయకండి

సూర్యాస్తమయం తర్వాత జుట్టు, గోళ్లు కత్తిరించడం వంటివి అస్సలు చేయకూడదు.  అలాగే ఇంటిని ఊడ్చకూడదు. ఇలా చేస్తే కుటుంబ సభ్యుల మధ్య గొడవలకు దారి తీస్తుందని పండితులు అంటున్నారు. 

Image credits: Social Media

చాణక్య నీతి: ఈ 4 పనుల తర్వాత స్నానం తప్పనిసరి

Chanakya Niti: భర్తలో భార్య కోరుకునేది ఇదే

వీళ్లు ఇంటికొస్తే భోజనం పెట్టకుండా పంపొద్దు

మీ ఇల్లు వాస్తు ప్రకారమే ఉందా? ఓసారి ఇవి చెక్‌ చేసుకోండి..