చాణక్య నీతి ప్రకారం 4 పనులు చేసిన వెంటనే స్నానం చేయాలట. మరి, ఆ పనులేంటో తెలుసుకుందాం...
కలయిక తర్వాత
స్త్రీ, పురుషులు కలయిక తర్వాత స్నానం చేయడం ముఖ్యం. స్త్రీ, పురుషులు ఇద్దరూ తప్పనిసరిగా ఇది పాటించాలట.
షేవింగ్ తర్వాత
హెయిర్ కట్ చేయించుకున్నా, షేవింగ్ చేసుకున్నా వెంటనే స్నానం చేయాలి. ఎందుకంటే కటింగ్ తర్వాత శరీరంపై చిన్న చిన్న వెంట్రుకలు అంటుకుంటాయి. స్నానం చేస్తేనే శుభ్రపడతాం.
ఆయిల్ మసాజ్..
ఆయిల్ మసాజ్ తర్వాత వెంటనే స్నానం చేయాలని చాణక్య చెప్పారు. లేకపోతే చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందుకే నూనె రాసుకున్న వెంటనే స్నానం చేయాలి.
శవయాత్ర నుండి తిరిగి వచ్చాక
ఎవరి శవయాత్రకైనా శ్మశాన వాటికకి వెళ్ళినప్పుడు మన శరీరం అపవిత్రం అవుతుంది. అందుకే శవయాత్ర నుండి తిరిగి వచ్చాక స్నానం చేయడం చాలా ముఖ్యం.