బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం.. ఎవరు ఇంటికి వస్తే భోజనం పెట్టి పంపాలో ఇపుడు తెలుసుకుందాం పదండి.
బిడ్డ కొడుక్కి
కూతురు లేదా కొడుకు కొడుకు అయిన మనుమడు ఇంటికి వస్తే ఖచ్చితంగా భోజనం పెట్టాలి. అన్నం తినకపోయినా ఏదో ఒకటి తినిపించాలి.
చెల్లెలి కొడుక్కి
చెల్లెలి కొడుకు అయిన మేనల్లుడు ఇంటికి వస్తే కూడా తప్పనిసరిగా భోజనం పెట్టాలి. కానీ మేనల్లుడికి పాదాభివందనం చేయకూడదు.
చెల్లెలు
మీ ఇంటికి చెల్లెలు వస్తే కూడా ఆమెకు ఖచ్చితంగా భోజనం పెట్టాలి. సాధ్యమైతే ఏదైనా బహుమతి కూడా ఇవ్వొచ్చు.
అల్లుడు వస్తే
కూతురు లేదా చెల్లెలి భర్త అంటే అల్లుడు ఇంటికి వస్తే అతనికి భోజనం పెట్టకుండా పంపకూడదు. అల్లుడు మీ ఇంట్లో భోజనం చేస్తే ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని నమ్ముతారు.
సాధువులు వస్తే
ఇంటికి సాధువు వచ్చిన కూడా ఖచ్చితంగా భోజనం పెట్టాలి. లేదంటే మీకు దురదృష్టం కలుగుతుంది.