వైఎస్ జగన్ స్టిక్కర్ల గోల: ఆటోలను వెంటాడుతున్న పోలీసులు (వీడియో)

Oct 7, 2019, 6:46 PM IST

విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్టిక్కర్ల వ్యవహారం కలకలం రేపింది. బందర్ రోడ్‌లోని ఆలిండియా రేడియో వద్ద సోమవారం సాయంత్రం క్యాబ్స్, ఆటో టాక్సీలకు సీఎం జగన్మోహన్ రెడ్డికి థాంక్యూ చెబుతూ ఉన్న స్టిక్కర్లను ఇచ్చి వాటిని అతికించమని చెబుతున్నారు. ఈ క్రమంలో ఓ క్యాబ్ డ్రైవర్ మేం ఎందుకు అతికించాలంటూ పోలీసులను ప్రశ్నించాడు.