Oct 11, 2019, 1:22 PM IST
కృష్ణాజిల్లా, మచిలీపట్నం కోనేరు సెంటర్లో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తలపెట్టిన 36గంటల నిరవధిక నిరసన దీక్ష నేపథ్యంలో కొల్లురవీంద్రను అరెస్ట్ చేశారు. దీక్షకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. ఇసుకపై ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా మాజీ మంత్రి, టిడిపి నాయకుడు కొల్లు రవీంద్ర శుక్రవారం ఉదయం8 గంటలనుండి, శనివారం రాత్రి 8గం.ల వరకు నిరాహారదీక్ష తలపెట్టిన సంగతి తెలిసిందే.