Oct 25, 2019, 12:09 PM IST
కృష్ణా జిల్లా గన్నవరంలో ఓ రైతు ఎద్దుకు ఘనంగా అంతిమసంస్కారాలు నిర్వహించాడు. తొమ్మిదేళ్లుగా ఇంట్లో మనిషిలా కలిసిపోయిన తమ ఎద్దు చనిపోవడం జీర్ణించుకోలేకపోతున్నాడు. పోతురెడ్డిపల్లి అనే పేరు గల ఈ వృషభరాజం జాతీయ స్ధాయిలో వివిధ రంగాలలో 122 పతకాలు సాధించింది. ఇటివల కేసరపల్లి ఎన్. టీ. ఆర్ వెటర్నరీ కళాశాలలో ప్రాంగణంలో జరిగిన జాతీయస్ధాయి బండలాగుడు బల ప్రదర్శన పోటీలలో ఈ జత ఎడ్లకి మెదటి స్ధానం వచ్చింది. స్ధానిక పశు ప్రేమికులతో కలిసి మృతి చెందిన వృషభ రాజాన్ని భారీ ఊరెగింపుతో గ్రామం వీధుల్లో ఊరెగించి అంతిమ సంస్కారం నిర్వహించారు.