Oct 7, 2019, 3:39 PM IST
బెజవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు భక్తులకు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ క్రమంలో చివరి రోజు అమ్మవారిని కృష్ణానదిలో హంస వాహనంపై విహరింపచేయడం ఆనవాయితీగా వస్తోంది. అమ్మవారి జలవిహారానికి సంబంధించి హంస వాహనాన్ని పవిత్ర సంగమం వద్ద దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది సిద్ధం చేస్తున్నారు.
మహర్నవి సందర్భంగా సోమవారం అమ్మవారు మహిషాసుర మర్థిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.