టీఆర్ఎస్ దాడిలో ధ్వంసమైన కారులోనే... ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరిన షర్మిల

Nov 29, 2022, 3:03 PM IST

హైదరాబాద్ : వరంగల్ జిల్లా నర్సంపేటలో కొనసాగుతున్న తన పాదయాత్రను అడ్డుకోవడం, వాహనాల ధ్వంసం, వైఎస్సార్ టిపి నాయకులపై దాడిని నిరసిస్తూ ఇవాళ(మంగళవారం) వైఎస్ షర్మిల ఆందోళనకు దిగారు. టీఆర్ఎస్ శ్రేణులు ధ్వంసం చేసిన వాహనన్ని స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ హైదరాబాద్ సోమాజిగూడ నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసం ప్రగతిభవన్ కు  బయలుదేరారు.ప్రగతి భవన్ ముట్టడికి షర్మిల ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. అయితే కారులోంచి షర్మిల దిగకుండా ముందుకు వెళ్లేందుకే ప్రయత్నిస్తుండటంతో ఉద్రిక్త వాతావరణ నెలకొంది.