వరి వేస్తే ఉరేనన్న సన్నాసి సీఎం కేసీఆర్...: వైఎస్ షర్మిల ధ్వజం

Oct 30, 2022, 1:23 PM IST

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పి కేసీఆర్ అధికారంలో వచ్చారని... ఇప్పుడు అడిగితే ప్రభుత్వానికి సాధ్యం కాదు అవసరమైతే రైతులే నడిపించుకోవాలని అంటున్నాడని పేర్కొన్నారు.  ఫ్యాక్టరీని నడపడం ప్రభుత్వంతోనే సాధ్యం కాకుంటే రైతులతో ఎలా సాధ్యమవుతుంది... అపరమేధావినని చెప్పుకునే కేసీఆర్ కు ఇంత తెలియదా అంటూ ఎద్దేవా చేసారు. వైఎస్సార్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయకుండా అడ్డుకుంటే...కేసీఆర్ కనీసం ప్రభుత్వపరం కూడా చేయలేకపోయాడన్నారు. అటు వరి వేసుకోకుంటే ఉరే అన్న సన్నాసి ముఖ్యమంత్రి ఇటు చెరుకు సాగు కాకుండా చేస్తున్నాడు... ఇలాగయితే రైతులు ఎలా బతకాలి? అని ప్రశ్నించారు. చెరుకు రైతులకు మద్దతుగా వైఎస్ షర్మిల జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండలంలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ వద్ద ధర్నా నిర్వహించారు. ప్రజలు ఓట్లు వేస్తే గెలిచామన్న కృతజ్ఞత కేసీఆర్ కు ఉంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని షర్మిల డిమాండ్ చేసారు.