Aug 11, 2022, 12:39 PM IST
వికారాబాద్ : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల వ్యవసాయ కూలీ అవతారమెత్తారు.షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థాన పాదయాత్ర ప్రస్తుతం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే దుద్యాల మండల పరిధిలోని హకీంపేట గ్రామంలో పర్యటిస్తూ పొలంలో వరినాట్లు వేస్తున్న మహిళా కూలీలను ఆమె గమనించారు. దీంతో వెంటనే వరిమళ్లలో దిగిన షర్మిల రైతు కూలీలతో కలిసి వరి నాట్లు వేసారు.