Aug 12, 2022, 2:12 PM IST
కొడంగల్ : వైఎస్సార్ టిపి అధినేత్రి వైఎస్ షర్మిల రాఖీ పండగను పార్టీ నాయకులు, కార్యకర్తలు, కొడంగల్ ప్రజల మధ్యనే జరుపుకున్నారు. ప్రస్తుతం షర్మిల ప్రజాప్రస్థాన పాదయాత్ర నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గ పరిధిలో కొనసాగుతోంది. ఇవాళ రాఖీ పౌర్ణమి కావడంతో షర్మిలక్కతో రాఖీ కట్టించుకోడానికి వైఎస్సార్ టిపి నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు కోస్గి మండలం ముశ్రాఫా గ్రామంలోని పాదయాత్ర క్యాంప్ వద్దకు భారీగా చేరుకున్నారు. వైఎస్ షర్మిల కూడా అందరినీ సొంత సోదరులుగా భావించి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ షర్మిల రాఖీ పండగ శుభాకాంక్షలు తెలిపారు.