అభిమానులతో ఆత్మీయం సమావేశం... కారణమిదే: వెల్లడించిన షర్మిల

Feb 9, 2021, 4:27 PM IST

హైదరాబాద్: తెలంగాణలో ప్రస్తుత పరిస్థితుల దుష్ట్యా కొత్త పార్టీ ఏర్పాటు దిశగా వైఎస్ షర్మిల ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇందుకు బలం చేకూరుస్తూ ఇవాళ(సోమవారం) హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో తన తండ్రి, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... తెలంగాణలో రాజన్న రాజ్యం తమతోనే సాధ్యమని నమ్మకంగా వున్నామన్నారు.  అందుకోసమే ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.