తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ: ఇది జరిగితే కేసీఆర్ కి చెక్ పడ్డట్టే..!

Feb 10, 2021, 4:33 PM IST

కొద్దిసేపు షర్మిల ఎవరు వదిలిన బాణం అనే విషయం పక్కనబెడితే... షర్మిల పార్టీ పెడితే తెలంగాణాలో మారే రాజకీయ సమీకరణాల గురించి మనం మాట్లాడుకోవలిసి ఉంటుంది. తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ అధికారాన్ని దక్కించుకున్నాక, కాంగ్రెస్ ప్రాభవం బాగా మసకబారుతూ ఉన్న తరుణంలో కాంగ్రెస్ కి వీర విధేయులుగా ఉన్న కొందరు రెడ్లు తెరాస వైపు చూసారు.