Jul 16, 2022, 11:21 AM IST
పెళ్లి కావడం లేదని ఓ యువకుడు దారుణానికి తెగించాడు. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది.రాజన్న సిరిసిల్లా జిల్లా : రాజన్న సిరిసిల్లా జిల్లా.. సిరిసిల్లా పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద దారుణం జరిగింది. తెల్లవారు జామున పెట్రోల్ పోసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేటకు చెంిన ఏనుగుల పర్శరామ్ (25). రెండు నెలల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశాడు. అప్పుడు బయటపడ్డాడు. పెళ్లిజరగడం లేదన్న మనోవేదనతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.