Dec 7, 2020, 3:42 PM IST
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పులుల దాడులు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ పులుల దాడిలో ఇద్దరు మరణించారు. పెంచికల్‌పేట మండలం కొండపల్లి, దహెగాం మండలాల్లో పులుల దాడుల్లో మరణించిన నిర్మల, విఘ్నేష్ కుటుంబ సభ్యులను అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శించారు.ప్రభుత్వపరంగా బాధితుల కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి భరోసానిచ్చారు.