సంగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికుల జంగ్ సైరన్

Apr 8, 2023, 2:33 PM IST

సింగరేణి బొగ్గు గనుల్లో ప్రైవేటీకరణ చట్టాలకు వ్యతిరేకంగా కార్మికులు జంగ్ సైరన్ ఊదారు. ప్రధాని మోడీ తెలంగాణ రాక సందర్భంగా బొగ్గు బావుల వేలం నిలుపు చేసే ప్రకటన వచ్చేంతవరకు ఉద్యమాన్ని విరమించేది లేదని కార్మికులు ఉద్యమ బాట పట్టారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో కేటీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే చందర్ ఆధ్వర్యంలో మహా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. 134 సంవత్సరాల చరిత్ర కలిగిన సింగరేణిని ప్రైవేటుపరం చేసేందుకు బిజెపి కుట్రలు పన్నుతుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.