కేంద్రం కార్పొరేట్ పోకడలతో ఎల్.ఐ.సి సంస్థ మనుగడ ప్రశ్నార్ధకం.. గంగుల కమలాకర్

Sep 6, 2022, 9:29 AM IST

కరీంనగర్ : ఎల్.ఐ.సి ఒక సేవ సంస్థ.. కానీ, అలాంటి సంస్థను కేంద్రం రోడ్ మీదికి తీసుకు వచ్చిందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కేంద్రం కార్పొరేట్ పోకడలతో ఎల్.ఐ.సి సంస్థ మనుగడ ప్రశ్నార్ధకం చేసిందన్నారు. పేదల సంపాదనను గద్దల లాంటి పెద్దలకు పంచి పెడుతుంది. జీఎస్టీ ద్వారా సంపాదించిన సంపద అంబానీ ఆదాని లాంటి పెద్దలకు పెడుతుందన్నారు. ఏ పొరాటమైన కరీంనగర్ నుంచి ప్రారంభమవుతుంది. ఎల్ఐసి మా కుటుంబ సంస్థ.. టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ఎల్.ఐ.సి ఉద్యోగుల పోరాటంతో కేంద్రం తప్పకుండా దిగి వస్తుంది. ఎల్ఐసి ఉద్యోగులు చేసే పోరాటానికి నా సంపూర్ణ మద్దతు ఉంటుంది. మీరు ఢిల్లీలో చేసే పోరాటానికి నా సొంత ఖర్చులతో పంపిస్తాను.ఎల్.ఐ.సి ఒక సేవ సంస్థ.. అలాంటి సంస్థను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రోడ్ మీదకి తీసుకు వచ్చిందిని  బిసి సంక్షేమం... పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాక ర్అన్నారు. లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా - జేఏసీ అధ్వర్యంలో ఎల్.ఐ.సి-2 కార్యాలయం వద్ద శాంతియుత నిరసన ధర్నాకు  మంత్రి గంగుల కమలాకర్ సంఘీభావం తెలిపారు