Jul 18, 2020, 10:55 AM IST
తెలంగాణలో కరోనా పరిస్థితిలో దారుణాతి దారుణంగా ఉందంటూ ఓ వ్యక్తి పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జూబ్లీహిల్స్ కి చెందిన మోహన్ అనే వ్యక్తికి కరోనా నెగెటివ్ వచ్చింది కానీ సడెన్ గా బ్రీతింగ్ ప్రాబ్లం రావడంతో హాస్పిటల్ కు వెల్దామంటే.. గంటన్నరపాటు అపోలో, ఎఐజీ, కాంటినెంటల్, సన్ షైన్, కేర్, విరించి, నిజాంపేట.. ఇలా ఏ ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లినా తీసుకోలేదు. చివరికి ఓ ఆస్పత్రిలో 5 లక్షలు కడితే జాయిన్ చేసుకున్నారు. పరిస్థితి ఇంత దారుణమా.. డబ్బులు కట్టలేక, ఆస్పత్రిలో చేరలేక కరోనాతో పేషంట్లు చనిపోవడమే అంటున్న అతని ఆవేదన..