పండగపూటే నిజామాబాద్ లో దారుణం... వినాయక విగ్రహాలపై నల్లరంగు చల్లిన దుండగులు

Sep 1, 2022, 10:58 AM IST

నిజామాబాద్ : వినాయకచవితి పండగపూట గుర్తుతెలియని దుండగులు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. హిందువులు ఈ వినాయక నవరాత్రుల్లో ఎంతో భక్తిశ్రద్దలతో పూజించే గణనాథుడి విగ్రహాలపై దుండగులు నల్లటి సిరా చల్లారు. నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర ప్రాంతంలో అమ్మకానికి పెట్టిన వినాయక విగ్రహాలపై నల్లరంగు చల్లారు.  ఇలా పదిపదిహేను విగ్రహాలపై రంగుచల్లారు. ఇలా పండగపూట వినాయక విగ్రహాలపై రంగుచల్లడంపై హిందూసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.